Dog baby shower: పెంపుడు కుక్కను అలంకరించి..అపై ఆ మహిళ ఏం చేసిందంటే..? వీడియో..
ఇటీవల నెట్టింట పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆవులు, కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు వాటిని తమ కుటుంబ
నెట్టింట దూసుకుపోతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కకు చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. మెడలో పూల మాల వేసి, నుదుటన బొట్టు పెట్టింది. ఆ తర్వాత కుక్క ముందరి కాళ్లకు గాజులు కూడా వేసింది. అనంతరం ప్లేట్లలో రకరకాల స్వీట్లు, ఇతర ఆహార పదార్ధాలు పెట్టింది. తన కుక్కతో పాటు బయట వీధి కుక్కలను పిలిచి ఆ భోజనాన్ని వాటికి విందులా సమర్పించింది. ఇదంతా ఎందుకు అంటే.. తన పెంపుడు కుక్కకు ఆమె సీమంతం చేసింది. సీమంతం చేసి తన బంధువులకు, చుట్టు పక్కలవారికి కాకుండా సాటి మూగజీవులకు ఆహారం అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోపై “బేబీ షవర్ ఫర్ మై క్యూటీ” అనే టెక్స్ట్ ఓవర్‌లేతో రన్ అవుతుంది. దాంతో ఆమె ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను 50 లక్షల మంది వీక్షించగా 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను తప్పక ఆశీర్వదిస్తాడు’ అని ఓ నెటిజన్ అంటే, ‘మీ ఆలోచన ఊహకు అందనిది.. ఇలాగే కొనసాగించండి’ అని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

