Viral: మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ.. జోరు వానలో విధుల్లో నిమగ్నమైన ఇన్స్‌పెక్టర్.

|

Aug 03, 2023 | 7:23 AM

ఖమ్మం నగరంలో కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొద్ది రోజులుగా కుండపోత వర్షాలతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటిలో నడవడానికి తీవ్ర ఇబ్బంది.. ఇక వాహనాలు వెళ్లేందుకు దారే లేదు. అలాంటి సమయంలో హోదాను పక్కనబెట్టి.. పారిశుద్ధ్య కార్మికురాలిగా మారిపోయింది. మురికి నీటిలో ప్యాంట్ పైకి మలచి.. జనం సేవలో మునిగిపోయిందో లేడీ ఇన్స్‌పెక్టర్.

ఖమ్మం నగరంలో కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్లు ప్రవహిస్తుండంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాత బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ట్రాఫిక్ సిఐ అంజలి స్వయంగా రంగంలోకి దిగారు. తన సిబ్బందితో వర్షంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను క్రమబద్దీకరించారు.పాత బస్టాండ్ లోని ట్రాఫిక్ సెంటర్ నుండి డివైడర్ వరకు తాడు కట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. మోకాళ్ళ లోతు నీరు రోడ్డు మీద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న తల్లి బిడ్డను సురక్షితంగా పక్కకు తీసుకువచ్చి రక్షించారు ట్రాఫిక్ సిఐ అంజలి.తల్లి బిడ్డకు సహాయం అందించి శభాష్ అనిపించుకున్నారు. ఇంతటి జోరు వానలో కూడా సిబ్బందితో కలిసి ట్రాఫిక్ సీఐ చూపిన చొరవకు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...