ఆమె మంచంపై నుంచి కింద‌ప‌డింది.. అగ్నిమాప‌క శాఖకు ఫోన్‌ చేసిన కుటుంబం

ఆమె మంచంపై నుంచి కింద‌ప‌డింది.. అగ్నిమాప‌క శాఖకు ఫోన్‌ చేసిన కుటుంబం

Phani CH

|

Updated on: Sep 09, 2023 | 10:51 AM

మ‌హారాష్ట్ర‌లోని థానే ప‌ట్ట‌ణానికి చెందిన 62 ఏళ్ల మ‌హిళ బరువు దాదాపు 160 కేజీలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె మంచానికే పరిమితమైంది. కదలిక లేకుండా మంచంపైనే ఉండేది. ఈ క్రమంలో వాగ్‌బిల్ ప్రాంతంలోని వారి ఫ్లాట్‌లో సెప్టెంబర్‌ 7 ఉదయం 8 గంటలకు మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం మీద నుంచి కింద ప‌డిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మ‌హారాష్ట్ర‌లోని థానే ప‌ట్ట‌ణానికి చెందిన 62 ఏళ్ల మ‌హిళ బరువు దాదాపు 160 కేజీలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె మంచానికే పరిమితమైంది. కదలిక లేకుండా మంచంపైనే ఉండేది. ఈ క్రమంలో వాగ్‌బిల్ ప్రాంతంలోని వారి ఫ్లాట్‌లో సెప్టెంబర్‌ 7 ఉదయం 8 గంటలకు మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం మీద నుంచి కింద ప‌డిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆమెను పైకి లేపి మంచంపై ప‌డుకోబెట్టేందుకు కుటుంబ స‌భ్యులు విశ్వప్రయత్నం చేశారు. దీంతో చేసేది లేక ఆమె కుటుంబ సభ్యులు థానే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స‌హాయం కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కింద ప‌డ్డ మ‌హిళ‌ను మంచంపై తిరిగి ప‌డుకోబెట్టారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ (ఆర్‌డీఎంసీ)కి చెందిన బృందం ఫ్లాట్‌కు చేరుకుని, మహిళను పైకి లేపి మంచంపై పడుకోబెట్టారని చెప్పారు. బాధిత మహిళకు ఎలాంటి గాయాలు కాలేదని ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీఎండబ్ల్యూలో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియోపై క్రేజీ కామెంట్స్

మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..

Google Maps: గూగుల్‌ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది

TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్‌ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్‌

హిట్‌ మ్యాన్ చాప్టర్ 1 టీజర్‌కు.. దిమ్మతిరిగే రెస్పాన్స్