అరె ఏంట్రా ఇదీ !! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్‌

Phani CH

Phani CH |

Updated on: Sep 08, 2022 | 9:34 AM

మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ (Escalator) ఎక్కారా.. నగరాల్లో ఉండే వాళ్లకు ఇది సాధారణ విషయమే అయినా మొదటిసారి ఎక్కేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది పూర్తిగా కొత్త అనుభవం.



మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ (Escalator) ఎక్కారా.. నగరాల్లో ఉండే వాళ్లకు ఇది సాధారణ విషయమే అయినా మొదటిసారి ఎక్కేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది పూర్తిగా కొత్త అనుభవం. వారు ఎస్కలేటర్ ఎక్కేందుకు చాలా భయపడుతుంటారు. దానిపై నుంచి పడిపోతామని ఆందోళన చెందుతుంటారు. అందుకే ఎస్కలేటర్ తో కొందరు ఫన్ కూడా క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. తాజాగా ఈ ఎస్కలేటర్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతునన ఈ క్లిప్ లో ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ పై పెద్ద లగేజ్ బ్యాగ్ ను పెట్టారు. ఎస్కలేటర్‌ రన్‌ అవుతున్న క్రమంలో ఆ బ్యాగ్ అదుపుతప్పి కిందికి పడిపోతుంది. ఎస్కలేటర్ దిగుతున్న మరో మహిళ బ్యాగ్ కింద పడిపోవడాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే వేగంగా కిందికి దిగేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోనే ఆ లగేజ్‌ బ్యాగ్‌ వచ్చి మహిళను ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ వీడియో చూస్తే ఆమెకు బలమైన గాయాలే తగిలినట్లు అర్థమవుతోంది. అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో

చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్‌ వంటకం పేరు పెట్టిన బ్రిటన్‌ దంపతులు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu