వీడియో తీసి హీరో అవుదాం అనుకున్న విద్యార్థి !! కట్ చేస్తే ఫ్యూజులు అవుట్
సండే.. హాలిడే.. ఫన్‌డే.. ముగ్గురు ఫ్రెండ్స్ సరదాగా చేసిన ఆలోచన.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది. సోషల్ మీడియా క్రేజీతో రైల్వే ట్రాక్‌పై వీడియో షూటింగ్ పెట్టారు ముగ్గురు స్నేహితులు.
సండే.. హాలిడే.. ఫన్‌డే.. ముగ్గురు ఫ్రెండ్స్ సరదాగా చేసిన ఆలోచన.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది. సోషల్ మీడియా క్రేజీతో రైల్వే ట్రాక్‌పై వీడియో షూటింగ్ పెట్టారు ముగ్గురు స్నేహితులు. రైలు వస్తుండగా.. ట్రాక్ పక్కన స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుండగా.. మిగతా వాళ్లు వీడియో షూట్ చేయడం మొదలుపెట్టారు. కానీ.. ఇది ఎంత డేంజరో వాళ్లు గుర్తించలేకపోయారు. ట్రాక్ పక్కన.. నడుచుకుంటూ వస్తున్న విద్యార్థిని రైలింజన్ ఢీ కొట్టింది. దీంతో ఆ విద్యార్థి ఒక్క ఉదిటిన ఎగరి పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖాజీపేట్ – మంచిర్యాల రైల్వే ట్రాక్‌పై వడ్డేపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా కోసం వీడియా షూట్ చేస్తుండగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్పీడ్‌గా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో ఆ విద్యార్థికి బలంగా గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు.. 108 వాహనంలో వరంగల్‌లోని MGM ఆస్పత్రికి తరలించారు. అతన్ని వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన స్టూడెంట్ ఆజయ్‌గా గుర్తించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరె ఏంట్రా ఇదీ !! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్
భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో
చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్ వంటకం పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

