భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో
వివాహబంధం ఎంతో పవిత్రమైనది. భార్యభర్తలు కష్టసుఖాలను ఎదుర్కొంటూ.. ఒకరికొకరు తోడుగా జీవితాంతం కొనసాగించే అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక్కోసారి ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.
వివాహబంధం ఎంతో పవిత్రమైనది. భార్యభర్తలు కష్టసుఖాలను ఎదుర్కొంటూ.. ఒకరికొకరు తోడుగా జీవితాంతం కొనసాగించే అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒక్కోసారి ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆలుమగలకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ వారిపాలిట వరంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. భార్య తన భర్తకు ప్రేమగా ఇచ్చిన కానుక అతని ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళ్తే… యూకేకు చెందిన డేవిడ్ లాస్ట్ అనే వ్యక్తికి తన భార్య బర్త్‌డే గిఫ్ట్‌గా యాపిల్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది. కాగా, ఇటీవల యాపిల్ వాచ్‌లోని సెన్సార్ దాదాపు 3,000 సందర్బాల్లో తక్కువ హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించి, లాస్ట్‌ను హెచ్చిరించింది. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు 48 గంటలపాటు వివిధ పరీక్షలు చేశారు. ఈ సమయంలో 138 సార్లు గుండె ఆగిపోయే స్థితికి వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. గుండెలో పెద్ద బ్లాక్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. తర్వాత అతడికి ఆపరేషన్ చేసి, పేస్‌మేకర్‌ను అమర్చారు. అలా తన భార్య ప్రేమగా ఇచ్చిన కానుక అతని పాలిట వరమైంది. కాగా, తన ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్‌ను ఎప్పటికీ తనతోనే ఉంచుకుంటానంటూ భావోద్వేగంతో చెప్పారు. యాపిల్ వాచ్ హెచ్చరికలతో గుండె ఆపరేషన్ చేయించుకున్న అతడు ప్రస్తుతం సాధారణ జీవనం గడుపుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్ వంటకం పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

