Galvan Soldier: అమ‌ర గాల్వాన్ సైనికుడి క‌ల‌ను నెర‌వేర్చిన భార్య‌..! సెల్యూట్ చేస్తారు అంతే..!

Galvan Soldier: అమ‌ర గాల్వాన్ సైనికుడి క‌ల‌ను నెర‌వేర్చిన భార్య‌..! సెల్యూట్ చేస్తారు అంతే..!

Anil kumar poka

|

Updated on: May 14, 2022 | 8:47 PM

గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికుల‌తో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన. దీప‌క్ సింగ్ భార్య సైన్యంలోకి అడుగు పెట్టింది. దీప‌క్ సింగ్ అనుకున్న క‌ల‌ల‌ను నెర‌వేర్చి చూపించింది. అయితే..


గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికుల‌తో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన. దీప‌క్ సింగ్ భార్య సైన్యంలోకి అడుగు పెట్టింది. దీప‌క్ సింగ్ అనుకున్న క‌ల‌ల‌ను నెర‌వేర్చి చూపించింది. అయితే.. ఆ క‌ల‌ను చూడ‌డానికి దీప‌క్ సింగ్ లేరు. ఇదే త‌న‌ను ఇబ్బంది పెట్టే అంశ‌మ‌ని దీప‌క్ సింగ్ భార్య రేఖా సింగ్ వాపోయారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన దీప‌క్ సింగ్‌, భార్య రేఖా సింగ్‌ను ఎలాగైనా సైన్యంలో ఓ అధికారిణిని చేయాల‌ని కల‌లు క‌నేవారు. అయితే.. రేఖా సింగ్ మాత్రం.. విద్యా రంగంలో ప‌నిచేస్తూ.. స‌మాజ సేవ చేయాల‌న్న తాప‌త్ర‌యంతో ఉండేవారు.అయితే.. త‌న భ‌ర్త వీర మ‌ర‌ణం పొందిన త‌ర్వాత‌… ఆమె ఎలాగైనా త‌న భ‌ర్త ఆశ‌యాన్ని నెర‌వేర్చాల‌ని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆర్మీ అధికారుల‌ను కూడా సంప్ర‌దించి, త‌గు మార్గ‌నిర్దేశ‌నం పొందారు. సైనిక అధికారుల మార్గ‌నిర్దేశ‌నంతో ఆమె నోయిడా వెళ్లి, సైనిక ప్ర‌వేశ ప‌రీక్ష రాశారు. మొద‌టి సారి త‌ప్పారు. రెండో సారి కూడా ఈ ప‌రీక్ష రాసి, ఉత్తీర్ణ‌త సాధించారు. దీంతో ఆమె లెఫ్టినెంట్ హోదాను ద‌క్కించుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 14, 2022 08:47 PM