తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్ ట్విస్ట్ !!
తాగివచ్చి వేధిస్తున్న భర్తను దారికి తెచ్చుకోవాలనకుంది. చివరికి అతని మరణానికి కారణమైన భార్య, ఆమె తల్లి కటకటాలపాలయ్యారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.
తాగివచ్చి వేధిస్తున్న భర్తను దారికి తెచ్చుకోవాలనకుంది. చివరికి అతని మరణానికి కారణమైన భార్య, ఆమె తల్లి కటకటాలపాలయ్యారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. మండ్యకు చెందిన మహేశ్‌కు అదే ప్రాంతానికి చెందిన శిల్పాతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులోని కోణనకుంటెలో దంపతులు కాపురం పెట్టారు. అయితే ఉద్యోగరీత్య మహేశ్ మండ్యలో ఉంటూ అప్పుడప్పుడు బెంగళూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలో శిల్పపై అనుమానం పెంచుకున్న మహేశ్ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో శిల్ప తల్లి వద్ద తనగోడు వెళ్లబోసుకుంది. కాగా, ఇటీవల బెంగళూరుకు వచ్చిన మహేశ్‌ను గట్టిగా హెచ్చరించాలని.. తన అన్న కుమారుడు బాలాజీకి పురమాయించింది శిల్పా. దీంతో మహేశ్‌ను ఇష్టమొచ్చినట్లు బాలాజీ కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఏం తెలియదన్నట్లు మృతదేహాన్ని తీసుకుని శిల్ప మండ్యకు వెళ్లింది. మహేశ్ ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన అతని తల్లిదండ్రులు మండ్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శిల్పను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా అసలు విషయం బయట పడింది. శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బాలాజీ కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడియో తీసి హీరో అవుదాం అనుకున్న విద్యార్థి !! కట్ చేస్తే ఫ్యూజులు అవుట్
అరె ఏంట్రా ఇదీ !! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్
భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో
చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్ వంటకం పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

