భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??

ఊహతెలిసినప్పటినుంచి తన భర్తను ఓ యువతి ఇష్టపడుతోందని తెలిసిన ఓ మహిళ దగ్గరుండి తన భర్తకు ఆ యువతిని ఇచ్చి రెండో వివాహం జరిపించింది. స్థానికులు, బంధువులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో జరిగింది.. చిన్న గూడూరు గ్రామానికి చెందిన సురేష్ - సరిత దంపతులకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది.. వీరి ఇరువురికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు.

భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??

|

Updated on: Sep 02, 2024 | 8:58 PM

ఊహతెలిసినప్పటినుంచి తన భర్తను ఓ యువతి ఇష్టపడుతోందని తెలిసిన ఓ మహిళ దగ్గరుండి తన భర్తకు ఆ యువతిని ఇచ్చి రెండో వివాహం జరిపించింది. స్థానికులు, బంధువులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో జరిగింది.. చిన్న గూడూరు గ్రామానికి చెందిన సురేష్ – సరిత దంపతులకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది.. వీరి ఇరువురికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. వీరిద్దరిదీ అన్యోన్యమైన జంట. అయితే మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ-వీరాస్వామి దంపతుల చిన్నకూతురు సంధ్య సురేష్ ను తనకు ఉహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తుంది. ఈ విషయం తన భార్య సరిత దృష్టికి చేరింది. ఆ మానసిక వికలాంగురాలి మనసు అర్థం చేసుకున్న సరిత పెద్దమనసు చేసుకుంది. వారిద్దరికీ వివాహం జరిపించాలనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది. సంధ్య తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించింది. నా భర్తకు మళ్ళీ పెళ్ళి, మీరంతా రావాలి మళ్ళీ అని బందు మిత్రులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. అతిధులందరి సమక్షంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్దంగా తన భర్తకి రెండో పెళ్లి జరిపించింది. ఈ విచిత్ర వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది. వధువు సంధ్య తన పని తాను కూడా చేసుకోలేని చిన్న పిల్లల మనస్తత్వం కలదని, తనను పసి పిల్లలానే చూసుకోవాలని సరితకు స్థానికులు, తల్లిదండ్రులు సూచించారు. ఇక సరితను అందరూ అభినవ సతిగా కొనియాడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు

50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి

అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్‌ ఈ’ వైరస్‌

దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో

Follow us