ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ… ఆ తర్వాత ??

అద్భుత కళాఖండాలు, ప్రాచీన సంపదకు నెలవైన మ్యూజియంలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. అందుకే అందులో వస్తువులను అత్యంత జాగ్రత్తగా ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఈ క్రమంలో 3వేల ఏళ్ల క్రితంనాటి ఓ కళాఖండం నాలుగేళ్ల చిన్నారి ఉత్సాహం కారణంగా ముక్కలైంది. ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న హిచ్‌ మ్యూజియంలో కాంస్య యుగానికి చెందిన అనేక కళాఖండాలున్నాయి.

ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ... ఆ తర్వాత ??

|

Updated on: Sep 02, 2024 | 8:59 PM

అద్భుత కళాఖండాలు, ప్రాచీన సంపదకు నెలవైన మ్యూజియంలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. అందుకే అందులో వస్తువులను అత్యంత జాగ్రత్తగా ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఈ క్రమంలో 3వేల ఏళ్ల క్రితంనాటి ఓ కళాఖండం నాలుగేళ్ల చిన్నారి ఉత్సాహం కారణంగా ముక్కలైంది. ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న హిచ్‌ మ్యూజియంలో కాంస్య యుగానికి చెందిన అనేక కళాఖండాలున్నాయి. వీటిలో చెక్కుచెదరకుండా ఉన్న ఓ జాడీకి అరుదైన కళాఖండంగా గుర్తింపు ఉంది. ప్రత్యేక ఆకర్షణగా ఉన్న దీనిని మ్యుజియం ప్రవేశ మార్గంలో ఉంచారు. మ్యూజియం సందర్శనకు అలెక్స్‌, తన నాలుగేళ్ల బాలుడితో వచ్చాడు. ఈ క్రమంలో ఉత్సాహంతో అందులో ఏముందని ఆ బాలుడు తొంగి చూశాడు. దాంతో అది కిందపడి ముక్కలైంది. పగిలిపోయిన ఆ కళాఖండం పక్కన బాలుడు నిలబడి ఉండటం చూసి అలెక్స్‌ షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడు దాన్ని పడేయలేదని తొలుత పేర్కొన్నాడు. కానీ, తానే పడేశానని బాలుడు చెప్పడంతో ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల అనంతరం.. మ్యూజియం ఆహ్వానం మేరకు బాలుడితోపాటు అలెక్స్‌ మళ్లీ అక్కడకు వచ్చాడు. తిరిగి దానిని అతికించి ఉండటంతో అలెక్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తుంటారని.. కానీ, ఈ విషయం భిన్నమని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. బాలుడు ప్రమాదవశాత్తు పడేశాడే కానీ, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??

మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు

50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి

అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్‌ ఈ’ వైరస్‌

దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

Follow us