మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు
పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది. ఎస్సై వినయ్, గ్రామస్థుల కథనం ప్రకారం.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు.
పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది. ఎస్సై వినయ్, గ్రామస్థుల కథనం ప్రకారం.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ వారు.. వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలకు చెందిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. గాయపడిని వారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి
అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్ ఈ’ వైరస్
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

