ఒక్క లీటరు పాలు రూ. 5 లక్షలు.. ఏమిటా స్పెషాలిటీ వీడియో

Updated on: May 06, 2025 | 5:42 PM

లీటర్‌ పాల ధర ఎంత ఉంటుంది..? పాల బ్రాండ్‌ను బట్టి అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది. ఎంత కాస్ట్లీ పాలైనా లీటర్‌కు మహా అయితే 5 వందల రూపాయలు ఉంటుదనుకోవచ్చు. కానీ ఇటీవల ఓ యువకుడి వద్ద దొరికిన పాలు మాత్రం లీటరుకు ఏకంగా 5 లక్షల రూపాయల ధర పలుకుతుందట. ఇటీవల రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు.

యువడుకి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పాల ధర మార్కెట్లో 15 లక్షల రూపాయలు పలుకుతుందట. ఆ యువకుడు బైక్ ట్యాంక్ కింద దాచిపెట్టి ఈ పాలను తీసుకెళుతుండగా పోలీసులు పసిగట్టి పట్టుకున్నారు. అయితే లక్షలు విలువ జేసే ఈ పాలకున్న ప్రత్యేకత ఏమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి ఈ పాలు నల్లమందు పాలు. ఆ యువకుడు ఈ పాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు మాటువేసి అరెస్ట్‌ చేశారు. అతను పాలి నుంచి జోధ్‌పూర్‌కు పాలు తీసుకెళుతుండగా మార్గమధ్యలో రోహత్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఆ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ పాలను మత్తులోకి వెళ్లేందుకు ఉపయోగిస్తారట. అందుకే బహిరంగ మార్కెట్లో ఈ పాలకు లక్షల రూపాయల డిమాండ్‌ ఉంటుందని సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :
వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియోఅడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో