అడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో
పెళ్లి వేడుకలో మూడు ముళ్ల తంతు గురించి పక్కన పెడితే.. జనాలు పదే పదే మాట్లాడుకునే విషయం వంటలు. వంటలు అద్భుతంగా ఉన్నా.. తిని పేర్లు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే, పెళ్లి మండపాల్లో గొడవలకు కారణమయ్యే విషయాల్లో వంటలు టాప్‌లో ఉంటాయి. వెజ్ కావచ్చు.. నాన్ వెజ్ కావచ్చు.. తమకు నచ్చినంత వడ్డించలేదని గొడవలు పడేవారు ఎక్కువ. తాజాగా, ఓ వ్యక్తి పనీర్ కర్రీ కోసం పెళ్లి మండపంలో అలజడి సృష్టించాడు. మినీ బస్సుతో మండపంలో నానా రచ్చ చేశాడు. ఈ ఘటనలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం జరిగింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ వారాణాసిలోని పహాడీ గ్రామానికి చెందిన రాజనాథ్ యాదవ్ కూతురి పెళ్లి హమీద్ పూర్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం పహాడీ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బంధుగణం హమీద్ పూర్ చేరుకున్నారు. రాత్రి విందులో మినీ బస్ డ్రైవర్ ధరేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నాడు. తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు తండ్రి అక్కడికి వచ్చాడు.పెద్ద గరిటెతో అతడి తలపై కొట్టాడు. ధరేంద్ర కోపంగా అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. ఒక ఐదు నిమిషాల తర్వాత మినీ బస్సుతో పెళ్లి మండపంలోకి దూసుకువచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం :
మనవడితో మహిళ జంప్.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..
సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..

