తెల్లవారితే మరిది పెళ్లి.. ఇంతలోనే వదిన..
తెల్లవారితో ఇంట్లో పెళ్లి.. ఇల్లంతా చుట్టాలు, బంధువులతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బంధుమిత్రులంతా సంబురాల్లో మునిగిపోయారు. ఇంతలోనే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకూ సంతోషంగా గడిపిన వరుడి వదిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిన ఆమె మృత్యు ఒడికి చేరుకుంది.
దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడులో పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి మారేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం. ఆ రోజు మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండటంతో భర్త చింతలపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అదే రోజు రాత్రి తమ్ముడి వివాహం ఉండటంతో మారేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి భార్యను తీసుకొచ్చారు. సాయంత్రం ఓ స్కానింగ్ సెంటర్‌లో పరీక్ష చేయించారు. అనంతరం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు జ్యోత్స్న గర్భం దాల్చిందని, గర్భసంచిలో కాకుండా పిండం పేగులో పెరగటంతో అది పగిలిపోయి రక్తస్రావమైందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో మారేశ్వరరావు రూ.40వేలు ఫీజు చెల్లించి భార్యను ఆస్పత్రిలో చేర్చారు. సదరు వైద్యునితో పాటు మరో ఇద్దరు డాక్టర్లు అదే రోజు రాత్రి బాధితురాలికి శస్త్రచికిత్స చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేర్‌టేకర్ మృతి.. సింహం చివరి చూపుకు వచ్చి.. ఏం చేసిందంటే ??
భర్త గడ్డం నచ్చక.. మరిదితో మహిళ జంప్
బస్సు ఆపి డ్రైవర్ నమాజ్.. ఆ తర్వాత
జైలు ప్రాంగణంలోనే పెళ్లి.. ఖైదీలే అతిథులు.. అదే కదా మ్యాజిక్కు
గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తుడు.. చివరిలో సూపర్ ట్విస్ట్
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!

