America: ఉయ్యాలలో శిశువును ఎగరేసుకుపోయిన సుడిగాలి.! వైరల్ వీడియో.

America: ఉయ్యాలలో శిశువును ఎగరేసుకుపోయిన సుడిగాలి.! వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 20, 2023 | 4:53 PM

అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. అది తెలిసి అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు తెలిపారు. టెన్నెన్సీలో ఇటీవల బలమైన సుడిగాలి వచ్చింది. దాంతో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని..,

అమెరికాలో ఊహించని సంఘటన జరిగింది. అది తెలిసి అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని టెన్నెస్సీని తాకిన తీవ్ర తుఫానులో ఊయలతోపాటు ఎగిరిపోయిన నాలుగు నెలల చిన్నారి ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దేవుని దయతో తమ చిన్నారి సజీవంగా తమకు దొరికాడని తల్లిదండ్రులు తెలిపారు. టెన్నెన్సీలో ఇటీవల బలమైన సుడిగాలి వచ్చింది. దాంతో తమ ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని, దాంతో పైకప్పుకు కట్టిన ఊయలలో ఉన్న నాలుగు నెలల చిన్నారితో సహా ఊగుతున్న ఊయలఎగిరిపోయిందని తెలిపారు. కుండపోత వర్షంలో.. నేలకూలిన చెట్ల మధ్య చిన్నారి చిక్కకుపోయాడు. అంతేకాదు ఈ తుఫానులో ఆ చిన్నారితో పాటు వారి ఏడాది వయసున్న మరో కుమారుడు, తల్లిదండ్రులకు స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సిడ్నీ మూర్ తమకు ఎదురైన ఈ అనుభవాన్ని తెలియజేశారు. ఊయలతోపాటు ఎగిరిపోతున్న తమ కుమారుడిని రక్షించేందుకు తన భర్త పరిగెత్తారని, అయితే తుపాను తాకిడి కారణంగా కుమారుడిని రక్షించలేకపోయారని తెలిపారు. ఈ సమయంలో మూర్ తన మరో కుమారుడు ప్రిన్స్‌టన్‌కు ఎలాంటి అపాయం కలుగకుండా గట్టిగా పట్టుకుంది. పది నిమిషాల పాటు చిన్న కొడుకు కోసం ఆ దంపతులు వెదకగా.. కూలిన చెట్ల మధ్య చిన్నారిని గుర్తించారు. మొదట కుమారుడు చనిపోయాడని భావించారు మూర్‌ దంపతులు. అయితే అదృష్టవశాత్తు పిల్లాడు బతికే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.