Cake Capital: ఈ ఏడాది వీటి ఆర్డర్‌లో బెంగళూరు టాప్‌.! అందుకే కేక్‌ కేపిటల్‌గా గౌరవించామన్న స్విగ్గీ.

Cake Capital: ఈ ఏడాది వీటి ఆర్డర్‌లో బెంగళూరు టాప్‌.! అందుకే కేక్‌ కేపిటల్‌గా గౌరవించామన్న స్విగ్గీ.

Anil kumar poka

|

Updated on: Dec 20, 2023 | 5:08 PM

బిర్యానీ త‌ర్వాత జ‌నాలు అధికంగా ఇష్టప‌డేది కేక్స్. ఆన్‌లైన్‌ ఫుడ్‌ అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో నచ్చిన ఫ్లేవర్‌లో కేకు కళ్లముందు ఉంటుంది. అలా కేకులు ఆర్డర్‌ చేయడంలో ఈ ఏడాది దేశంలోనే టాప్‌గా నిలిచింది బెంళూరు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫాం స్విగ్గీపై ఈ ఏడాది బెంగ‌ళూర్ వాసులు ఏకంగా 85 ల‌క్షల కేకులు ఆర్డర్ చేశారు. దీంతో బెంగళూరు.. కేక్ క్యాపిట‌ల్ టైటిల్‌ను ద‌క్కించుకుంది. హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ 2023 వార్షిక నివేదిక‌లో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్లడ‌య్యాయి.

బిర్యానీ త‌ర్వాత జ‌నాలు అధికంగా ఇష్టప‌డేది కేక్స్. ఆన్‌లైన్‌ ఫుడ్‌ అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో నచ్చిన ఫ్లేవర్‌లో కేకు కళ్లముందు ఉంటుంది. అలా కేకులు ఆర్డర్‌ చేయడంలో ఈ ఏడాది దేశంలోనే టాప్‌గా నిలిచింది బెంళూరు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫాం స్విగ్గీపై ఈ ఏడాది బెంగ‌ళూర్ వాసులు ఏకంగా 85 ల‌క్షల కేకులు ఆర్డర్ చేశారు. దీంతో బెంగళూరు.. కేక్ క్యాపిట‌ల్ టైటిల్‌ను ద‌క్కించుకుంది. హౌ ఇండియా స్విగ్గీడ్ ఇన్ 2023 వార్షిక నివేదిక‌లో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్లడ‌య్యాయి. చాక్లెట్ ఫ్లేవ‌ర్‌తో కూడిన కేక్‌ల‌ను బెంగ‌ళూర్ వాసులు ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అందుకే బెంగ‌ళూర్‌ను కేక్ క్యాపిట‌ల్‌గా గౌర‌వించామ‌ని, 2023లో న‌గ‌ర‌వాసులు పెద్దసంఖ్యలో కేకుల‌ను ఆర్డర్ చేశార‌ని స్విగ్గీ వెబ్‌సైట్‌ బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు ఇండియాలో నిమిషానికి 271 కేక్‌ల‌ను ఆర్డర్ చేశారని పోస్ట్ తెలిపింది. ఇక ఈ ఏడాది స్విగ్గీలో అత్యధిక మంది ఆర్డర్ చేసిన ఫుడ్‌గా బిర్యానీ ముందువ‌ర‌స‌లో నిలిచింది. ఇక ముంబై వాసి 2023లో 42.3 ల‌క్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిర్యానీతో పాటు కేక్స్‌, గులాబ్ జామ్‌, పిజ్జాలనూ క‌స్టమ‌ర్లు అధికంగా ఆర్డర్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.