Khammam: ప్రమాదాలకు అడ్డా మధిర-నందిగామ రోడ్డు.. బైక్ అదుపుతప్పి మహిళ మృతి.

|

Jun 23, 2023 | 7:59 AM

ఇటీవలే వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన కలల జీవితాన్ని పండించుకోడానికి అత్తింట అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో విధి ఆమెను ప్రమాద రూపంలో మింగేసింది. భర్తతో కలసి సినిమాకు వెళ్తున్న ఆమె కారు ప్రమాదంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

ఖమ్మం పట్టణ శివారు టేకులపల్లి కి చెందిన సంధ్య తర భర్తతో కలిసి నందిగామ మండలం కొణతమత్కూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుండి బుల్లెట్‌పైన సినిమా చూసేందుకు రాత్రి సమయంలో మధిర వెళ్తున్నారు. వీరితోపాటు భర్త చెల్లెలు, అక్క పిల్లలు, అన్న కొడుకు అందరూ ఒకే బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయపట్నం వద్ద మూలమలుపు తిరుగుతుండగా ఎదురుగా వేగంగా కారుదూసుకురావడంతో సడన్‌ బ్రేక్‌ వేసాడు. దాంతో అదుపు తప్పి బైకుపైన సైడ్‌యాంగిల్‌లో కూర్చున్న సంధ్య ఒక్కసారిగా కిందపడిపోయింది. దాంతో సంధ్య తలకి బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. సంధ్యకు వివాహమై ఐదు నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో మహాదేవపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల అభిషేక్‌ అనే యువకుడు ప్రమాదాని గురై మృది చెందాడు. ఇది ప్రమాదకరమైన మలుపు కావడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయకపోడంతో ఇలా ప్రమాదాలకు గురై పలువురు మృతి చెందుతున్నారు. దాంతో స్థానికులు ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకుని తక్షణం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 23, 2023 07:59 AM