verity wedding: వధువు 3 అడుగులు, వరుడు 2 అడుగులు..పెళ్లికి మోదీకి ఆహ్వానం.! పెళ్లి అంటే ఇది కదా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలనుకున్నాడు. గతంలో నాకు పెళ్లిచేయండి బాబోయ్..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలనుకున్నాడు. గతంలో నాకు పెళ్లిచేయండి బాబోయ్.. అంటూ పలువురు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న అతను ఎట్టకేలకు ఓ ఇంటివాడవుతున్నాడు. పెళ్లేంటి..? రాజకీయనాయకులకు మొరపెట్టుకోవడమేంటి అనుకుంటున్నారా… ఈ పెళ్లిలో ఓ విశేషముంది. ఇక్కడ పెళ్లి చేసుకోబోయే వరుడి ఎత్తు కేవలం 2.3 అడుగులు మాత్రమే మరి ఇతని సమానమైన జోడీ ఎక్కడ దొరుకుతుంది. అందుకే పలువురు పొలిటికల్ లీడర్స్‌ను, ప్రభుత్వ అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. అందులో భాగంగా తనకు పిల్లను చూసి పెట్టాలంటూ 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశాడు. ఏళ్లతరబడి తన జోడీ కోసం గాలిస్తున్న అతనికి ఎట్టకేలకు అమ్మాయి దొరికింది. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే తన పెళ్లికి ప్రధాని మోదీని, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలనుకుంటున్నాడు. మరి ఇతగాడికి అమ్మాయి ఎక్కడ దొరికింది అనేగా మీ డౌట్? చాలా సంవత్సరాల పోరాటం తర్వాత హాపూర్ గ్రామంలో అతనికి వధువు దొరికింది. గతేడాది మార్చిలో 3 అడుగుల పొడవున్న బుషారాను కలిశాడు. అదే ఏడాది ఏప్రిల్ లో వీళ్ల నిశ్చితార్థం జరిగింది. అయితే, బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఈ వాళ్లు నిర్ణయించుకున్నారు. కాగా, నవంబర్ 7న వీళ్ల పెళ్లి జరగనుంది. పెళ్లికి మన్సూరి ప్రత్యేకమైన షేర్వానీ, త్రీ-పీస్ సూట్‌ను కుట్టించుకున్నాడు. తమ పెళ్లికి ప్రధానితో పాటు యూపీ సీఎం హాజరుకావాలని అజీమ్ కోరుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి మోదీతో పాటు యోగి ఆదిత్యనాథ్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తానని అజీమ్ చెబుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..