Woman On Roadside: అయ్యోరామా..! మధ్యలోనే ఆగిపోయిన అంబులెన్స్‌.. రోడ్డు మీదే మహిళ ప్రసవం.!

Woman On Roadside: అయ్యోరామా..! మధ్యలోనే ఆగిపోయిన అంబులెన్స్‌.. రోడ్డు మీదే మహిళ ప్రసవం.!

Anil kumar poka

|

Updated on: Nov 04, 2022 | 8:20 PM

పురిటి నొప్పులు పడుతున్న మహిళను ఆస్పత్రి తీసుకెళ్తున్న అంబులెన్స్‌ మధ్యలోనే ఆగిపోయింది. వాహనంలో డీజిల్‌ అయిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆస్పత్రికి చేరే మార్గం కనిపించలేదు.


పురిటి నొప్పులు పడుతున్న మహిళను ఆస్పత్రి తీసుకెళ్తున్న అంబులెన్స్‌ మధ్యలోనే ఆగిపోయింది. వాహనంలో డీజిల్‌ అయిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆస్పత్రికి చేరే మార్గం కనిపించలేదు. మరోవైపు మహిళకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. చేసేది లేక రోడ్డుపైనే స్థానిక మహిళల సాయంతో అంబులెన్స్‌ సిబ్బంది ప్రసవం చేసారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. అక్టోబరు 28 రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ ఫోన్‌ చేసారు. కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు.అయితే, వాహనంలో డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 04, 2022 08:20 PM