Groom Baarat: అయ్యో ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఎన్ని కష్టాలో.. చివరికి గాడిదే దిక్కు.. ఫన్నీ వీడియో..
హిందూ సంప్రదాయంలో పెళ్లి వేడుకకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లి పిలుపుల దగ్గర నుంచి అప్పగింతల వరకూ దేనికవే ప్రత్యేకమైనవి. ఇటీవల వాటిని మరింత ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ కాలం వధూవరులు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెళ్లి కుమారుడికి సమయానికి గుర్రం దొరకలేదు. దాంతో గాడిదను ఆశ్రయించాడు. ఏమాత్రం సంకోచించకుండా ఎంచక్కా గాడిదపై ఊరేగింపుగా వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ముందుకు సాగుతుండగా, అతని బంధువులు దాని ముందు డ్యాన్సులు చేసారు. మహిళలు హారతులు పట్టారు. అలా వరుడు ఆ గాడిదపైనే ఊరుగుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు. ఓ యూజర్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘గుర్రం లేకపోతేనేమీ గాడిద ఉందిగా’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. లాఫింగ్ ఎమోజీలతో జోకులు పేలుస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు. ‘ఇది నా ఫ్రెండ్ పెళ్లి’ అని ఒకరు కామెంట్ చేస్తే.. కొత్త పెళ్లి కొడుక్కి అప్పుడే ఎన్ని కష్టాలొచ్చాయో అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

