Loading video

Verity Wedding Card: పెళ్లికి రాకపోయినా పర్వాలేదు.. కట్నం పంపించేయండి.. వెరైటీ వెడ్డింగ్ కార్డు.

|

Oct 08, 2023 | 10:44 AM

ఇటీవల వివాహం చేసుకునే యువతీ యువకులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ వివాహం పదికాలాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని తపనపడుతున్నారు. అందుకు రకరకాల విధానాలు అవలంభిస్తున్నారు. ఇక పెళ్లి అంటే ఆహ్వాన పత్రికనుంచి విందు భోజనం వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఓ యువ జంట వినూత్నంగా ఆలోచించింది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి తమ పెళ్లి పత్రికను మోడ్రన్‌గా ఆహ్వానితులకు పంపించారు.

ఇటీవల వివాహం చేసుకునే యువతీ యువకులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ వివాహం పదికాలాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని తపనపడుతున్నారు. అందుకు రకరకాల విధానాలు అవలంభిస్తున్నారు. ఇక పెళ్లి అంటే ఆహ్వాన పత్రికనుంచి విందు భోజనం వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఓ యువ జంట వినూత్నంగా ఆలోచించింది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి తమ పెళ్లి పత్రికను మోడ్రన్‌గా ఆహ్వానితులకు పంపించారు. అందులో మీరు పెళ్లికి రాలేకపోతే చింతించకండి.. మాకు మీరు ఇవ్వాలనుకున్న కానుకను వెడ్డింగ్‌ కార్డ్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌తో మాకు పంపించేయండి అన్నట్టుగా ఆకట్టుకునే విధంగా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రూపొందించారు. ఇప్పడది సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వధూవరులు మొబైల్‌ఫోన్ ఉపయోగించి తమ వెడ్డింగ్ కార్డ్‌‌ను మోడ్రన్‌గా ఉండేలా ప్లాన్ చేస్తూ.. తమ కార్డ్ వెనకాల బార్‌కోడ్ ఇచ్చారు. దానిని క్లిక్ చేస్తే చాలు.. పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి.. వధూ వరుల ఫోటో షూట్, వెడ్డింగ్ టైము, పెళ్లి వేదిక మ్యాప్‌తో సహా ప్రత్యక్షం అవుతుంది. ఇక పెళ్లి‌కి అటెండ్ అవ్వలేని వారు ఉంటే.. అదే బార్ కోడ్‌‌ను స్కాన్ చేసి కట్నం కూడా వేయవచ్చు. ఈ వెరైటీ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..