Viral Video On Social Media: అడవిలో ఉన్న ఓ ఎలుగుబంటికి రోజూ అక్కడ ఉన్న అవే జంతువులను, చెట్లను పుట్టను చూసి బోరు కొట్టినట్లుంది. దీంతో మనుషులేనా సరదాగా షాపింగ్ కు వెళ్ళేది.. నేను వెళ్తా అనుకున్నట్లు ఉంది. రోడ్డుమీదకు షైర్ కు వచ్చి.. అలా ఓ డిపార్ట్మెంటల్ షో రూమ్ కు షాపింగ్ కు వచ్చింది. ఈ ఘటన యుఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
లాస్ ఏంజిల్స్‌లోని పోర్టర్ రాంచ్ పరిసరాల్లోని రాల్ఫ్ స్టోర్స్ లో ఒక ఎలుగుబంటి షాప్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిచూసి దుకాణదారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ షాప్ లో ఎలుగుబంటి తిరుగుతుందని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ వయోజన కేంద్రం అనేక ఫోన్ కాల్‌ను అందుకుంది. చివరకు ఎలుగుబంటిని శాంతింపజేసి పట్టుకోగలిగారు. ఎలుగుబంటిని ఏంజిల్స్ నేషనల్ ఫారెస్ట్‌కు తీసుకెళ్లారు.
Also Read: Cow Dung Products: ఆవు పేడకు ఓ మంచి బిజినెస్ ఐడియా తోడైతే కాసుల వర్షమే.. మీరూ ట్రై చేయొచ్చు