AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎప్పుడూ వెనుకడుగు వేయకు.. గొప్ప సందేశమిస్తున్న పెంపుడు శునకం

Anand Mahindra - Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా వీడియోలు వినోదాన్ని పంచడంతో పాటు మనలో స్ఫూర్తిని రగిలించేవిగా ఉంటాయి. బిజీ షెడ్యూల్‌లోనూ అలాంటి వైరల్ వీడియోలను నిత్యం తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.

Viral Video: ఎప్పుడూ వెనుకడుగు వేయకు.. గొప్ప సందేశమిస్తున్న పెంపుడు శునకం
Pet Dog Viral Video -Shared By Anand Mahindra
Janardhan Veluru
|

Updated on: Aug 13, 2021 | 1:17 PM

Share

Anand Mahindra – Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా వీడియోలు వినోదాన్ని పంచడంతో పాటు మనకు స్ఫూర్తి సందేశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. బిజీ షెడ్యూల్‌లోనూ అలాంటి వైరల్ వీడియోలను నిత్యం తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. తద్వారా తన అభిమానులు, నెటిజన్స్‌‌కు గొప్ప సందేశమిస్తూ వారు తమ జీవితంలో ఎదిగేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన షేర్ చేసే వీడియోలు, ప్రత్యేక స్ఫూర్తి సందేశాలకు సోషల్ మీడియాలో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆయన ట్విట్టర్ ఖాతాకు దాదాపు 84 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే.. అదంతా ఆయన నిత్యం షేర్ చేసే కంటెంట్‌‌ను నెటిజన్స్ ఏ రేంజ్‌లో ఆశ్వాదిస్తారో అర్థంచేసుకోవచ్చు.  ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన తాజాగా ఓ పెంపుడు శునకానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఎప్పుడూ వెనుకడుగు వేయకు అంటూ తన ఫాలోవర్స్‌కు పిలుపునిచ్చారు. కేవలం 6 సెకన్ల నిడివి కలిగినదే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంట్లోకి ప్రవేశించేందుకు డోర్ తెరవాలని పెంపుడు శునకం తగ్గేదె లె అన్నట్లు ప్రయత్నిస్తోంది. ఈ వీడియో న్యూయార్క్‌లోని తన స్నేహితుడి ఇంట్లో తీసినదిగా వెల్లడించిన ఆనంద్ మహీంద్ర..చివరకు దాన్ని ఇంట్లోకి అనుమతించినట్లు తెలిపారు. తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కఠిన ప్రయత్నం చేస్తే ఫలితం తప్పక లభిస్తుందని..ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదంటూ ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి దాదాపు 1.25 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన వీడియోను చూడండి..

ఆనంద్ మహీంద్ర సందేశంతో ఏకీభవిస్తూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో గొప్ప సందేశం ఉందంటున్నారు. నోరులేని జీవి తన ప్రయత్నంతో ఆశించుకున్నది సాధించుకుంటే.. అన్ని శక్తులు కలిగిన మానవుడు ఎందుకు తాము అనుకున్నది సాధించలేరంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read..

Hyderabad: త్రీ ఇడియట్స్.. పట్టపగలే ఇళ్లకు కన్నాలు.. సీసీలకు అస్సలు చిక్కరు.. ఫైనల్‌గా

Man Bites Snake: నన్నే కాటేస్తావా..? పామును నోటితో కొరికి చంపి.. రక్తం తాగాడు.. ఇంకా చేశాడంటే..?