Myanmar: జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష విధింపు.
సైన్యం కఠిన చట్టాల కారణంగా మయన్మార్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
సైన్యం కఠిన చట్టాల కారణంగా మయన్మార్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, వారి వ్యాపారాలను బలవంతంగా మూసివేయించింది. మయన్మార్‌లో వేతనాల పెంపు చట్ట విరుద్ధమేమీ కాదు. కానీ, ద్రవ్యోల్బణ ఆందోళనల వేళ ఇలా జీతాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోందట. ఇదే విషయాన్ని దుకాణాల ముందు అంటించిన నోటీసుల్లో పేర్కొంది.
వీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది. ప్రజస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్‌సాన్ సూచీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలో మిలటరీ పాలనలో ఉండగా.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు పెరగడం ఇతరత్రా సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి సైన్యంపై తిరుగుబాట్లు చేస్తున్నాయి. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

