Viral Video: ట్రాఫిక్ పోలీసులనే బోల్తా కొట్టించిన మహిళ.. చలాన్‌ తప్పించుకునేందుకు ఏం చేసిందంటే?

| Edited By: Ravi Kiran

Dec 28, 2021 | 7:15 AM

Trending Video: సోషల్ మీడియాలో ఓ మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో స్కూటీ నడుపుతున్న ఒక అమ్మాయి ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టి మరీ తప్పించుకుంది.

Viral Video: ట్రాఫిక్ పోలీసులనే బోల్తా కొట్టించిన మహిళ.. చలాన్‌ తప్పించుకునేందుకు ఏం చేసిందంటే?
Traffic Viral Video
Follow us on

Trending Video: రోడ్డుపై బండి పత్రాలు లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవారు తరచూ ట్రాఫిక్ పోలీసులను చూసి తమ మార్గాన్ని మార్చుకుంటారనడంలో సందేహం లేదు. అందుకే సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారికి చలాన్‌ను విధించడంలో పోలీసులు చాలాసార్లు విజయం సాధిస్తుండగా, అదే సమయంలో ఇలాంటి వ్యక్తులు కూడా అప్పుడప్పుడూ పోలీసులను తప్పించుకుని పారిపోతుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. చలాన్‌ నుంచి తప్పించుకోవడానికి పోలీసులకే చుక్కలు చూపించింది.

రోడ్డుపై తనిఖీలు జరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో, ట్రాఫిక్ పోలీసు ఒక అమ్మాయిని ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. కానీ, ఆ అమ్మాయి పోలీసుని పట్టించుకోకుండా కటింగ్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఇంతలో, పోలీసు పరుగెత్తుకుంటూ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ, విఫలమవుతాడు. ఇది గమనించిన మరో పోలీస్ ఆమెను వెంబడించి స్కూటీని పట్టుకుంటాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి స్కూటీని ఆపకుండా స్పీడ్ పెంచింది. దీంతో స్కూటీని పట్టుకుంటున్న పోలీసు డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. స్కూటీ నడుపుతున్న అమ్మాయి ఈ మొత్తం చర్య వెనుక బైక్‌పై అమర్చిన కెమెరాలో రికార్డ్ అయింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ విధంగా రహదారిపై డ్రైవ్ చేయకూడదు. ఇది మీకు, రహదారిపై నడిచే ఇతర వ్యక్తులకు ప్రమాదకరం’ అంటూ ఒకరు, ‘ఈమె దేవదూత కాబోలు’ అని కామెంట్లు చేశారు. ఈ ఫన్నీ వీడియో Instagramలో black_lover__ox అనే పేజీలో అప్‌లోడ్ చేశారు.

Also Read: Viral Video: గేటు దూకి పెంపుడు కుక్కను నోటకరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత‌.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Viral Video: 14 నెలల తర్వాత సంరక్షకుడిని కలిసిన ఏనుగుల గుంపు.. వాటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..