అయ్యో.. అది నీ పిల్ల కాదే.. పిల్లి పిల్ల..నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో!
నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వుపుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించినవి అధికంగా ఉండడం విశేషం. జాతి వైరం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెటింట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. ఈ వీడియోలో ఒక వానరం జాతివైరాన్ని మరిచి ఓ పిల్లికూనను చేరదీసి కన్నబిడ్డలా సాకుతోంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటిపెట్టుకునే ఉంటోంది. పిల్లిపిల్ల కూడా కోతిని తన తల్లిలాగే భావిస్తూ దాని ఒడిలో హాయిగా నిద్రపోతోంది. కోతి, పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గార్లవొడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ దృశ్యం భక్తులను,స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పిల్లికూనపట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో
తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
