Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫైర్‌బాల్‌తో గేమ్స్‌.. వద్దన్నా వినలేదు.. చివరకు ఏం జరిగిందంటే? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!

Trending Video: ఎప్పుడూ నిప్పుతో ఆడకూడదని పెద్దలు చెబుతుంటారు. అది ఎంతో ప్రమాదకరమని ఈ వీడియో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

Viral Video: ఫైర్‌బాల్‌తో గేమ్స్‌.. వద్దన్నా వినలేదు.. చివరకు ఏం జరిగిందంటే? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!
Fire ball Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 14, 2021 | 10:59 AM

Viral Funny Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవుతుంటాయి. వీటిని ప్రజలు చూడటానికి ఇష్టపడుతుండడంతో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. కొన్ని వీడియోలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. మరికొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. కొన్నింటిని చూసి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. Facebook, Instagram, Twitter ఇలా అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఫన్నీ వీడియోలు తరచుగా కనిపిస్తాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరూ పగలబడి నవ్వుతారనడంలో సందేహం లేదు.

ఎప్పుడూ నిప్పుతో ఆడకూడదని పెద్దలు చెబుతుంటారు. కాదని నిప్పుతో గేమ్స్ ఆడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. అందులో ఒక వ్యక్తి నిప్పుతో ఆడుకోవడం కనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే మాత్రం వీడియో చూడాల్సిందే.

వీడియోలో ఒక వ్యక్తి తన చేతుల్లో గోల్ఫ్ స్టిక్ పట్టుకుని, గోల్ఫ్ స్టిక్‌తో కాలుతున్నఫైర్ బాల్‌ను కొట్టడం మీరు చూడవచ్చు. ఇంతలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. అతని టీ-షర్టుకు కూడా మంటలు వ్యాపించాయి. దీని తరువాత, అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయి నదిలోకి దూకుతాడు. దాంతో మంటలు ఆరిపోతాయి. అదే సమయంలో పక్కనున్న వ్యక్తి బిగ్గరగా నవ్వడం కూడా వీడియోల చూడొచ్చు. అయితే, ఆలోచించాల్సిన విషయమేమిటంటే, అక్కడ చుట్టూ నీరు లేకుంటే మాత్రం భారీ ప్రమాద జరిగేదనడంలో సందేహం లేదు.

ఈ ఫన్నీ వీడియో Instagram లో best.failsever పేరుతో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షణలను పొందింది, అయితే చాలా మంది నవ్వుతున్న ఎమోజీని కామెంట్ బాక్స్‌లో షేర్ చేసారు. నిప్పు అనేది చాలా ప్రమాదకరం, దానితో ఎప్పుడూ ఆడకూడదు అని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. చిన్నపాటి మంటలు చెలరేగినా పెను ప్రమాదం జరుగుతుంది. అందువల్ల అగ్నికి దూరంగా ఉండటం మంచిదంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Best Fails (@best.failsever)

Also Read: Navdeep Saini video: 100కిమీ వేగంతో సైనీ విసిరిన బంతి.. అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన వికెట్‌.!(వీడియో)

Bears video: ఉద్ధానంలో ఎలుగు బంటి హల్‌చల్‌.. తరిమికొట్టిన గ్రామస్తులు..(వీడియో)