Bears video: ఉద్ధానంలో ఎలుగు బంటి హల్‌చల్‌.. తరిమికొట్టిన గ్రామస్తులు..(వీడియో)

Bears video: ఉద్ధానంలో ఎలుగు బంటి హల్‌చల్‌.. తరిమికొట్టిన గ్రామస్తులు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 15, 2021 | 8:51 AM

ఎలుగుబంట్ల సంచారం శ్రీకాకుళం జిల్లా వాసులను కలవరపెడుతోంది. సమీప అటవీ ప్రాంతాల్లో నుంచి జనవాసాల్లోకి ఎలుగు బంట్లు వస్తుండడంతో వారు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ప్రధానంగా ఉద్ధానం


ఎలుగుబంట్ల సంచారం శ్రీకాకుళం జిల్లా వాసులను కలవరపెడుతోంది. సమీప అటవీ ప్రాంతాల్లో నుంచి జనవాసాల్లోకి ఎలుగు బంట్లు వస్తుండడంతో వారు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ప్రధానంగా ఉద్ధానం పరిసరప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా పల్లెసారధిలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. రాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చి, నానా హంగామా సృష్టించింది. గ్రామంలో పరుగులు పెడుతూ.. గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది.దీంతో గ్రామస్తులు కర్రలు తీసుకుని తరమడంతో ఎలుగుబంటి సమీప తోటల్లోకి వెళ్లిపోయింది. కాగా గత కొన్ని రోజులుగా ఇది జరుగుతుందని, అటవీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని పల్లెసారధి గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గత నెలలో అంబుగాం గ్రామంలోని ఓ పరిశ్రమలోకి చొరబడేందుకు ఎలుగుబంటి ప్రయత్నించింది. పరిశ్రమ చుట్టూ ఉన్న రేకులను ధ్వంసం చేసింది. అంతకుముందు వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని పలుగ్రామాల్లోనూ ఇలాంటి సంఘటనలు సంభవించాయి.

Published on: Dec 15, 2021 08:50 AM