Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambulance as free taxi Video: వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్‌ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు..! వైరల్ అవుతున్న వీడియో..

Ambulance as free taxi Video: వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్‌ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2021 | 9:02 AM

సాధారణంగా అంబులెన్స్‌లు ఎందుకు ఉపయోగిస్తారు..? ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యంతో ఎవరికైనా సీరియస్‌ అయినప్పుడు ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎంతో విలువైన అంబులెన్స్‌ సేవలను


సాధారణంగా అంబులెన్స్‌లు ఎందుకు ఉపయోగిస్తారు..? ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, అనారోగ్యంతో ఎవరికైనా సీరియస్‌ అయినప్పుడు ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎంతో విలువైన అంబులెన్స్‌ సేవలను సొంత పనులకు ఉపయోగించుకుని దుర్వినియోగం చేసాడు. అలా ఒకసారి రెండుసార్లు కాదు.. ఏకంగా 39 సార్లు అలా వాడుకున్నాడు. తైవాన్‌కు చెందిన ఓ యువకుడు సూపర్‌ మార్కెట్‌లకు వెళ్లిన ప్రతిసారి తిరుగు ప్రయాణంలో అంబులెస్స్‌కు ఫోన్‌ చేశాడు. అలా చాలా సార్లు మెడికల్‌ ఎమెర్జెన్సీ అని కాల్‌ చేయడంతో అంబులెన్స్‌ సిబ్బంది స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.

అయితే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆస్పత్రిలో చేరినవాళ్లు ట్రీట్‌ మెంట్‌ తీసుకోవాలి కదా.. కానీ ఆ వ్యక్తి ఆస్పత్రిలోకి వెళ్లగానే అక్కడినుంచి మెల్లగా జారుకునేవాడు. తరచూ ఇలా జరగుతుండటంతో ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. దాంతో ఆ వ్యక్తిపై నిఘా పెట్టారు. ఎప్పటిలాగే ఈ ఘరానా మోసగాడు అంబులెన్స్‌కి కాల్‌ చేశాడు. అంబులెన్స్‌ వెళ్లింది.. సదరు వ్యక్తిని తీసుకొచ్చి ఆస్పత్రిలో దించారు. ఆ వ్యక్తిని గమనిస్తున్న ఆస్పత్రి సిబ్బంది అతన్ని పట్టుకొని నిలదీశారు. దాంతో మనోడి బండారం బయటపడింది. అతను ఆస్పత్రి అంబులెన్స్‌కు పదేపదే కాల్‌ చేయడానికి కారణం ఏంటని అడిగారు.. సూపర్‌ మార్కెట్‌ నుంచి తన ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్‌ను టాక్సీలా వాడుకుంటున్నాని, తన ఇల్లు ఆస్పత్రికి పక్కనే ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోవటం ఆస్పత్రి సిబ్బంది వంతైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి అంబులెన్స్‌ సేవలను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా విధిస్తామని పోలీసులు సదరు వ్యక్తిని హెచ్చరించారు. యువకుడు చేసిన పనికి సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Published on: Dec 16, 2021 08:48 AM