Child Monkey head stuck in a bowl Viral: రోహిణి కార్తె ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి దాహం వేసిన ఓ వానరం చెంబులో ఉన్న కాస్త నీటితో దాహం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. ఇంకేముంది వెంటనే చెంబులో తలను దూర్చింది. దీంతో కోతి తల కాస్త చెంబులో ఇరుక్కుపోయింది. సాధారణంగా ఒక్క నిమిషం దుప్పటి గట్టిగా చుట్టుకుంటేనే మనకు ఊపిరి ఆడదు. అలాంటిదీ, తల ఇరుక్కుపోయిన ఆ చిన్నారి కోతి విలవిలలాడింది.
చిన్నారి కోతి పరిస్థితిని చూసిన తల్లి కోతి మాతృ హృదయంతో తల్లడిల్లిపోయింది. తన బిడ్డకు ఏమౌతుదోనని తెగ భయపడిపోయాయింది. ఇది గమనించి తలను చెంబును వేరు చేసేందుకు ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఆ చెంబు తోనే తల్లి కోతి 3 రోజులుగా బిడ్డను తన వెంట వేసుకొని తిరుగుతున్న దృశ్యాలు చూపారులను బాధను కలిగించింది. అయ్యో పాపం కోతికి గాలి, నీరు, ఆహారం ఎలా అందుతున్నాయని ఆవేదనతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేశారు కాలనీ వాసులు. తల్లి కోతి జనాన్ని దరిదాపుల్లోకి రానివ్వలేదు.
చిట్ల చివరికి ఎలాగోలా పిల్ల కోటిని పట్టుకొని తలను చెంబు నుంచి విముక్తి కలిగించారు. దీంతో కోతి చెంబు కథ సుఖాంతమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బజారులో చోటుచేసుకుంది.
Read Also…. Viral Video: పెంపుడు కుక్కల కోసం ఎలుగుబంటిని ఎదిరించిన యువతి… ( వీడియో )