Viral Video: ఇన్‌స్టా రీల్ కోసం పక్కా ప్లాన్.. యాక్షన్‌లో లీనం.. వెనక్కు తిరిగి చూస్తే ఒక్కసారిగా షాక్.. వైరల్ వీడియో

|

Mar 27, 2022 | 3:48 PM

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది ఇప్పటివరకు 1 లక్షకు పైగా వ్యూస్‌తో నెట్టింట్లో దూసకపోతోంది.

Viral Video: ఇన్‌స్టా రీల్ కోసం పక్కా ప్లాన్.. యాక్షన్‌లో లీనం.. వెనక్కు తిరిగి చూస్తే ఒక్కసారిగా షాక్.. వైరల్ వీడియో
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను షేర్ చేసే ట్రెండ్ ఎక్కువైంది. విభిన్నమైన వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతోమంది ట్రై చేస్తు్న్నారు. కొందరు లిప్ సింక్ ద్వారా ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే, మరికొందరు తమ డ్యాన్స్ స్కిల్స్‌తో అందరినీ అలరిస్తున్నారు. ఇలాంటి వారందరికీ సోషల్ మీడియా ఓ వేదికగా మారింది. ఇక్కడ మీరు అన్ని రకాల వీడియోలను చూడొచ్చు. ఇందులో కొన్ని చాలా ఫన్నీగానూ, మరికొన్ని కాస్త ఆశ్చర్యంగానూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్(Viral Video) అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి వీడియో చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె చేసిన ప్రయత్నంలో చిన్న తప్పు జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

వీడియో తీయడానికి కెమెరా స్టాండ్‌పై నిలబడిన ఒక అమ్మాయి, కొంచెం ముందుకు వెళ్లి కెమెరాకు ఎదురుగా నిలబడి డ్యాన్స్ చేయడం ప్రారంభించినట్లు వీడియోలో చూడొచ్చు. తన డ్యాన్స్ ముగించుకుని కెమెరా వైపు తిరిగి చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కెమెరా స్టాండ్ సహా నీటిలో పడిపోయింది. ఆ తర్వాత ఆమె కెమెరాను నీటిని నుంచి తీసుకుంది. ఈ అమ్మాయిలాగే వీడియోలను రూపొందించే ప్రక్రియలో ఎంతోమంది ఇలానే ఇబ్బంది పడిన వీడియోలు నెట్టింట్లో ఎన్నో ఉన్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.

ఈ ఫన్నీ వీడియో మొబైల్_ఫోటోగ్రఫీ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 1 లక్షకు పైగా వ్యూస్‌లు వచ్చాయి. 4 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు పలు కామెంట్లు కూడా ఇచ్చారు.

Also Read: Viral Video: బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం దాసోహం.. కళ్లు కనిపించకున్నా బాస్కెట్‌ బాల్‌ గేమ్‌లో అదరగొట్టిన బాలిక

Viral Video: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే