Pushpa Srivalli Dance: శ్రీవల్లి డ్యాన్స్ స్టెప్ వేసి వధువును ఆకట్టుకున్న వరుడు.. ఆదిరిపోయిందిపో..!

Viral Video: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా శ్రీవల్లీ పాటకు వధూవరులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Pushpa Srivalli Dance: శ్రీవల్లి డ్యాన్స్ స్టెప్ వేసి వధువును ఆకట్టుకున్న వరుడు.. ఆదిరిపోయిందిపో..!
Bride Groom Dance On Pushpa Srivalli Song

Updated on: May 01, 2022 | 11:23 AM

Pushpa Srivalli Dance: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప’ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా విడుదలై చాలా నెలలు గడిచినా అందులోని డైలాగులు, పాటలు మాత్రం ఇంకా పిచ్చెక్కిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట జనాల మనసులను ఆకట్టుకుంది. ఈ పాటపై విపరీతంగా రీళ్లు, వీడియోలు రూపొందించారు. ఇప్పుడు ఈ పాటకు వధూవరులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వరుడు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ స్టెప్ వేసి వధువును ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వధువు కూడా వరుడికి వంత పాడారు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది.

వరుడు అతని స్నేహితులు కొందరు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేయడం.. వధువు ఆతని ముందు నిలబడి నవ్వుతూ డాన్స్ చేయడం వీడియోలో మీరు చూడవచ్చు. వధూవరులిద్దరూ చాలా సరదాగా మూడ్‌లో కనిపిస్తారు. డ్యాన్స్ తర్వాత, వరుడి స్నేహితుడు కూడా ‘తగ్గేదీ లే’ అనే స్టైల్‌ని కొట్టమని అడిగాడు. అందుకు వరుడు వెంటనే అదే ఊపుతో చేశాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులు తప్ప మిగతా అందరూ డ్యాన్సులు, పాటలు పాడతారు. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల వధూవరులు కూడా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోలోనూ వధూవరుల డ్యాన్స్ కనిపిస్తుండటం హృదయాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఇలాంటి వీడియోలు ఎప్పుడూ కనిపించవు మరీ.

మీరూ ఈ వీడియో చూడండి:

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో selva_051 పేరుతో షేర్ చేయడం జరిగింది. దీనికి ఇప్పటివరకు 3.8 మిలియన్లు అంటే 38 లక్షల వీక్షణలు వచ్చాయి. అయితే 3 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఇది చాలా మంచి డ్యాన్స్ స్టెప్ అని ఒక యూజర్ రాస్తే, మరో యూజర్ వీడియోని క్యూట్ గా అభివర్ణించారు. అదేవిధంగా, మరొకరు ఈ జంటను క్యూట్‌గా వ్యాఖ్యానించారు.

Read Also…  Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు.. వీడేనయా.! వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..