Fit India Challenge: మంచు నేలపై కేవలం 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు చేసిన బీఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్!

|

Jan 25, 2022 | 9:38 PM

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కి చెందిన అధికారిక ట్విటర్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు దేశంతా ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. చర్చలకు దారితీసేంత విషయం ఏముందబ్బా.. ఆ వీడియోలోనని అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నా..

Fit India Challenge: మంచు నేలపై కేవలం 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు చేసిన బీఎస్ఎఫ్ జవాన్.. వీడియో వైరల్!
Bsf Jawans
Follow us on

BSF Jawan does 47 push ups in 40 seconds: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కి చెందిన అధికారిక ట్విటర్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు దేశంతా ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. చర్చలకు దారితీసేంత విషయం ఏముందబ్బా.. ఆ వీడియోలోనని అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నా.. సాధారణంగా చలికాలంలో పొద్దున్నే నిద్ర లేచి కాస్త మార్నింగ్ వాక్ చేయడానికి మనలో చాలా మంది నానాయాతన పడతారు. అట్లాంటిది దట్టంగా మంచు కురుస్తున్న ప్రదేశంలో ఒక జవాన్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోనే అది. దాంట్లో విచిత్రమేముందని పెదవి విరిచేయకండి! ఇక్కడే ఉంది ట్విస్టంతా..

ఈ వీడియోలో పూర్తిగా మంచుతో నిండిన మంచు నేలపై ఆర్మీ జవాన్ పుష్ అప్స్ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఐతే అంత చలిలో కూడా అతను కేవలం 40 సెకన్లలో 47 పుష్ అప్‌లను చేయడం విశేషం. ఫిట్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మంచులో పుష్‌అప్‌లు చేయడం వీడియోలో చూడొచ్చు. మరో జవాన్ ఒంటి చేత్తో పుష్‌అప్స్ చేస్తున్న వాడియో కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన దేశ రక్ష్లకులు అంతటి చలిలో ఎంత కఠోర వ్యాయామాలు చేస్తారో ఈ వీడియోలు తెలుపుతున్నాయి. ఇక ఈ వీడియోలను వీక్షించిన నెటిజన్లు జవాన్‌లను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య దేశప్రజలందరికీ పూర్తి భద్రత కల్పించడంతో పాటు, ప్రజలు ఫిట్‌గా ఉండేలా ప్రోత్సహించేందుకు బీఎస్‌ఎఫ్ జవాన్లు అంకితభావంతో ‘ఫిట్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్నారు. ఇక ఈ వీడియోలకు లక్షల్లో వీక్షణలు, వేలల్లో కామెంట్లతో నెట్టింట వైరల్ అయ్యాయి.

కాగా ఈ నెల ప్రారంభంలో (జనవరి 8న) బోనియార్ తహసీల్‌లోని LOC వెంబడి జమ్మూ – కాశ్మీర్‌లోని ఘగ్గర్ హిల్ గ్రామం నుండి ఓ గర్భిణీ స్త్రీని భారీగా మంచు కురుస్తన్నప్పటికీ, ప్రమాదకరమైన రోడ్డులో భారత సైన్యం ఆమెను బోనియార్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. మన జవాన్లు మనల్ని ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. మీరేమంటారు.. నిజమేకదా!

Also Read:

BEML Recruitment 2022: బీఈఎంఎల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000 వరకు జీతం.. వివరాలివే!