US House: రూ.15 లక్షల ఇంటిని రూ.3 కోట్లకు అమ్మింది.. ఇందులో ఇవే ప్రత్యేకతలు..
జీవితంలో అనుకున్నవి సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ తెలివి కూడా ఉండాలి. అందుకు నిదర్శనమే ఈ యువతి. తన అపారమైన తెలివితేటలు, అనుభవంతో రూ.15 లక్షలు కూడా విలువ చేయని ఓ పురాతన శిథిలావస్థలో ఉన్న ఇంటికి ఏకంగా రూ.3 కోట్ల విలువ తీసుకొచ్చి అందరి చేతా శభాష్ అనిపించుకుంటోంది.
జీవితంలో అనుకున్నవి సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ తెలివి కూడా ఉండాలి. అందుకు నిదర్శనమే ఈ యువతి. తన అపారమైన తెలివితేటలు, అనుభవంతో రూ.15 లక్షలు కూడా విలువ చేయని ఓ పురాతన శిథిలావస్థలో ఉన్న ఇంటికి ఏకంగా రూ.3 కోట్ల విలువ తీసుకొచ్చి అందరి చేతా శభాష్ అనిపించుకుంటోంది. అమెరికాకు చెందిన 30 ఏళ్ల బెట్సీ స్వీనీ 2020 కరోనా సమయంలో పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ నగరంలో 120 ఏళ్ల నాటి ఓ పాత ఇంటిని కొనుగోలు చేసింది. అది కూడా కేవలం 18వేల డాలర్లకు. నివసించేందుకు వీలులేని ఇంటిని కొనుక్కుంది. ఇల్లు పూర్తిగా శిథిలా వస్థలో ఉండటంతో దాన్ని ఎలాగైనా ఓ రూపానికి తీసుకురావాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్‌లో అపారమైన అనుభవం ఉన్న స్వీనీ.. తన తెలివితేటలను ఉపయోగించి ఆ ఇంటిని ఎంతో సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. విక్టోరియన్ ఫైర్ ప్లేస్‌లు, పాతకాలపు బాత్‌టబ్ వంటివాటిని సంరక్షించడంతోపాటు రెనొవేషన్‌కు లక్ష డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఇంటి పునర్నిర్మాణానికి ఉపయోగించిన సొమ్ము మొత్తం ఆమె లోన్ కింద తీసుకుంది. ఇక ఇంటి రెనోవేషన్ కోసం కొంతమంది నిపుణులను కూడా నియమించుకుంది. ఇలా రాత్రీ పగలు కష్టపడి… పాడుబడిన ఆ ఇంటిని ఎంతో విలాసవంతమైన ఆకర్షణీయమైన ఇంటిగా మార్చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు విలువ 3.75లక్షల డాలర్లు , భారత కరెన్సీలో రూ.3 కోట్లపైమాటే. రెనోవేషన్‌కు సంబంధించిన వీడియోలను కూడా స్వీనీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..