రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి.. చివరకు

Updated on: Mar 11, 2025 | 5:47 PM

దొంగతనం చేసిన వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారు. కొట్టేసిన బంగారాన్ని దాచి పెట్టడమో వ్యక్తులే కనిపించకుండా పోవడం వంటివి చేస్తుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే దొంగ మాత్రం తాను దోచేసింది పోలీసులకు దొరక్కూడదని మింగేశాడు.

అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి మరీ అతడిని అరెస్ట్ చేశారు. కానీ అతడు చోరీ చేసిన డైమండ్ దుద్దులను కనిపెట్టలేకపోయారు. నిందితుడే డైమండ్స్ మింగేశాడనే విషయం తెలుసుకున్నారు. అమెరికాలోని ఒర్లాండో రాష్ట్రంలో 32 ఏళ్ల జేతన్ లారెన్స్ గ్లైడర్… ఓర్లాండో మ్యాజిక్ ప్లేయర్ ప్రతినిధిగా చెప్పుకుని.. టిఫనీ అండ్ కో స్టోర్‌కు వెళ్లాడు. అక్కడే వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతూ.. ఓ ప్రత్యేక గదిలో వజ్రాల ఆభరణాలను చూశాడు. కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూనే.. డైమండ్ ఇయర్ రింగ్స్ కొట్టేసి పారిపోయాడు. అందులో ఒకటి అమ్మేసిన అతడు మరొక దాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఈ చోరీలో 7 లక్షల 69 వేల డాలర్ల ఇండియా కరెన్సీ ప్రకారం 6.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ ఇయర్ రింగ్స్ పోయినట్లు సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే నిందితుడు వాటిని మింగేశాడని తెలుసుకున్నారు. ఎక్స్‌రేలో అవి పొట్టలో ఉన్నట్లు నిర్థారణ అయింది. మలవిసర్జన ద్వారా బయటికొచ్చిన చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు డైమండ్‌ చెవి కమ్మలు కొట్టేయడం ఇది తొలిసారి కాదని గతంలో చోరీకి పాల్పడ్డ చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!

హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు

Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!

Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..

చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!