రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??

రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??

Phani CH

|

Updated on: Jul 09, 2022 | 8:17 PM

కొంతమంది కుటుంబాన్ని పోషించడం కోసం తాము ఏమైపోయినా పర్వాలేదని గొడ్డు చాకిరీ చేస్తుంటారు. ఎంతలా అంటే కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో పనిచేస్తుంటారు.

కొంతమంది కుటుంబాన్ని పోషించడం కోసం తాము ఏమైపోయినా పర్వాలేదని గొడ్డు చాకిరీ చేస్తుంటారు. ఎంతలా అంటే కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో పనిచేస్తుంటారు. అలాంటి వారిని చూసి చాలామంది పట్టించుకోకపోయినా.. ఎవరో ఒకరు స్పందించి వారికి సాయం చేస్తుంటారు. అలాంటి ఓ రిక్షా పుల్లర్‌ కష్టాన్ని చూసి ఓ పోలీస్‌ చలించిపోయాడు. అతని పట్ల తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను యూపీ పోలీసు అధికారి శివంగ్ శేఖర్ గోస్వామి ట్విట్టర్‌లో షేర్ చేశారు. రిక్షా లాగుతూ జీవనం సాగించే ఓ వ్యక్తి రోడ్డుపై మండుటెండలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రిక్షా లాగుతున్నాడు. అది చూసి చలించిపోయిన ఓ పోలీసు అతనికి చెప్పులు కొనిచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను యూపీ పోలీసు అధికారి శివంగ్ శేఖర్ గోస్వామి ట్విట్టర్‌లో షేర్ చేశారు. రిక్షా లాగుతూ జీవనం సాగించే ఓ వ్యక్తి రోడ్డుపై మండుటెండలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రిక్షా లాగుతున్నాడు. అది చూసి చలించిపోయిన ఓ పోలీసు అతనికి చెప్పులు కొనిచ్చాడు. ఆ చెప్పులు వేసుకున్న రిక్షా పుల్లర్‌ ఎంతో సంతోషించాడు. పోలీసుకు కృతజ్ఞతలు చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్‌ నేర్పిస్తూ..

Published on: Jul 09, 2022 08:17 PM