Auto Drives Guinness Record: రెండు చక్రాల ఆటోడ్రైవర్‌..! అద్భుత ప్రతిభకు దక్కిన గిన్నిస్‌ రికార్డ్‌.. వైరల్ అవుతున్న వీడియో

Updated on: Oct 12, 2021 | 10:02 AM

ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది.

ఓ ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలతో నడిపి రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఈ వీడియోనే కాకుండా ప్రపంచ రికార్డులకు సంబంధించి పలు వీడియోలు, చిత్రాలను ప్రజలతో పంచుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ తన ఆటోను రెండు చక్రాలతో 2.2 కిలోమీటర్లు నడిపారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

జగదీష్ తన స్టీరింగ్ ఉపయోగించి మూడు చక్రాల వాహనాలను రెండు చక్రాలతో నడిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధిస్తానని తను అనుకోలేదని అన్నారు. చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమం ప్రకారం కేవలం ఒక కిలోమీటరు దూరం వరకు రెండు చక్రాలపై నడిపితే రికార్డు సృష్టించినట్లే.. కానీ జగదీష్ తన మూడు చక్రాల వాహనాన్ని రెండు చక్రాలపై 2.2 కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు సృష్టించాడు. జగదీష్‌ ప్రతిభను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్‌ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)

 Viral Video: రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌పై ఫైర్‌(వీడియో)

 News Watch: పాలు రూ.1,195 గ్యాస్ సిలిండర్ రూ.2,657… కరెంట్ కోతలు తప్పవా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 Venkatesh Comments: సామ్‌-చై విడాకులపై వైరల్‌ అవుతోన్న వెంకీమామ పోస్టులు..! ఏమన్నారంటే..(వీడియో)

Published on: Oct 12, 2021 09:57 AM