మందు ఎక్కువై ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..

మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరినొకరు పెళ్లిచేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి

Phani CH

|

Apr 16, 2022 | 9:58 AM

మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరినొకరు పెళ్లిచేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి, మెదక్ జిల్లా చిలప్‌చేడ్ మండలం చండూరుకు చెందిన 22 ఏళ్ల ఆటోడ్రైవర్‌కు ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఏప్రిల్‌ 1న వీరిద్దరూ ఫూటుగా తాగి.. ఆ మైకంలో చండూర్‌ యువకుడు తాళి కట్టగా.. జోగిపేట యువకుడు కట్టించుకున్నాడు. తాళి కట్టించుకున్న యువకుడు.. కట్టిన వ్యక్తి ఇంటికి వెళ్ళి కాపురానికి వచ్చానంటూ వయ్యారాలు పోయాడు. దీంతో తాళి కట్టిన వ్యక్తి తల్లిదండ్రులు వచ్చిన యువకుడిని మందలించి పంపించారు. దాంతో ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. పోలీసులు కూడా ఇదేం కేసురా బాబు అనుకుంటూ.. తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేసుకున్నారు.

Also Watch:

ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్

వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ

Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu