KGF 2: 19ఏళ్ల టీనేజర్ అద్భుతం !! కేజీఎఫ్-2 ఎడిటర్ గా !!
సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది..
సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈసినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది. షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ ఎడిట్స్ చేసుకునే ఓ కుర్రాడు ఇంతటి భారీ బడ్జెట్‌తో కూడిన ప్యాన్ ఇండియా మూవీకి ఎడిటింగ్ చేసాడంటే నమ్ముతారా.. కానీ ఇది నిజం. కేజీఎఫ్-2 సినిమాకు ఎడిటర్‌గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు. అవును.. మీరు విన్నది నిజమే. ఉజ్వల్ కుల్‌కర్ణి అనే ఈ కుర్రాడు గతంలో షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు. కాగా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌కి అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కళ్ల బడ్డాయి.
Also Watch:
Viral Video: పట్టాల మధ్య మహిళ.. ట్రాక్ పై పరుగులు పెడుతున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో