KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2  ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

Phani CH

|

Updated on: Apr 16, 2022 | 7:45 AM

భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అద్భుతమైన నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు..

భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అద్భుతమైన నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‍గా వచ్చిన కేజీఎఫ్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మొదటి రోజే 130 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అంటే… ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Watch:

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!

Published on: Apr 16, 2022 07:43 AM