Higher Earning: ఈ కంపెనీ గురించి తక్కువ మందికి తెలుసు! దీని షేర్ ఎంత లాభమో తెలుసా?

Higher Earning: ఈ కంపెనీ గురించి తక్కువ మందికి తెలుసు! దీని షేర్ ఎంత లాభమో తెలుసా?

Subhash Goud

|

Updated on: Apr 02, 2024 | 5:14 PM

గ్లోబల్ వీసా ప్రాసెసింగ్, పౌరులకు ప్రభుత్వం అందించే సేవల అవుట్‌సోర్సింగ్ సర్వీసులు.. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ మార్కెట్ లో ఓ భాగం. ఈ సెక్టార్ కు సంబంధించి ఏకైక లిస్టెడ్ కంపెనీ BLS ఇంటర్నేషనల్. ఈ వ్యాపారానికి ఎక్కువ ఆస్తులు, మూలధనం అవసరం లేదు. నగదు ఉత్పత్తి బలంగా ఉంటుంది. ఇక వృద్ధి కోసం ఎక్కువ డబ్బును వెచ్చించాల్సిన అవసరం లేదు. వీటన్నింటితో పాటు..

గ్లోబల్ వీసా ప్రాసెసింగ్, పౌరులకు ప్రభుత్వం అందించే సేవల అవుట్‌సోర్సింగ్ సర్వీసులు.. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ మార్కెట్ లో ఓ భాగం. ఈ సెక్టార్ కు సంబంధించి ఏకైక లిస్టెడ్ కంపెనీ BLS ఇంటర్నేషనల్. ఈ వ్యాపారానికి ఎక్కువ ఆస్తులు, మూలధనం అవసరం లేదు. నగదు ఉత్పత్తి బలంగా ఉంటుంది. ఇక వృద్ధి కోసం ఎక్కువ డబ్బును
వెచ్చించాల్సిన అవసరం లేదు. వీటన్నింటితో పాటు, ప్రయాణ రంగంలో గ్లోబల్ రికవరీని దృష్టిలో ఉంచుకుని చూస్తే.. ఇది బలమైన సంస్థ. BLS 2005వ సంవత్సరంలో పోర్చుగల్ రాయబార కార్యాలయానికి సేవలను అందించడం ప్రారంభించింది. కంపెనీ వ్యాపారం ఇలా ప్రారంభమైంది. BLS మార్కెట్ వాటా ప్రయాణాల పెరుగుదల, మేజర్ కాంట్రాక్టుల రెన్యువల్ తో మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి, కంపెనీ ప్రభుత్వం నుండి పౌరుల సేవలు అంటే G2C, బ్యాంకింగ్ కరస్పాండెన్స్.. అంటే BC వ్యాపారంలోకి విస్తరిస్తోంది. వీసా ప్రాసెసింగ్, కాన్సులర్.. అంటే VC వ్యాపారం.. అసెట్ లైట్ లాంటిది. అంటే, ఆస్తుల కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ కంపెనీ తక్కువ మందికే తెలిసినా.. దీని షేర్‌ ఎంత లాభమో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Published on: Apr 02, 2024 04:57 PM