AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tribal Protest: డోలీ మోస్తూ ర్యాలీ నిర్వహించిన ఆదివాసీ మహిళలు.. ఎందుకంటే.?

Tribal Protest: డోలీ మోస్తూ ర్యాలీ నిర్వహించిన ఆదివాసీ మహిళలు.. ఎందుకంటే.?

Anil kumar poka
|

Updated on: Mar 12, 2024 | 5:32 PM

Share

ప్రభుత్వాలు ఎన్నిమారినా గిరిజనుల తలరాతలు మాత్రం మారడంలేదు. ఆదివాసీల కష్టాలు తీరడంలేదు. కనీస రహదారికి నోచుకోక డోలీలను ఆశ్రయిస్తున్నారు అడవిబిడ్డలు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. రోగులు, గర్భిణిలు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీరి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోతుంది

ప్రభుత్వాలు ఎన్నిమారినా గిరిజనుల తలరాతలు మాత్రం మారడంలేదు. ఆదివాసీల కష్టాలు తీరడంలేదు. కనీస రహదారికి నోచుకోక డోలీలను ఆశ్రయిస్తున్నారు అడవిబిడ్డలు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. రోగులు, గర్భిణిలు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీరి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోతుంది తప్ప వీరి సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. గురువారం మహిళా దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళలు నిరసన బాట పట్టారు. తమకు రోడ్డు కష్టాలు తీర్చాలంటూ డోలీ యాత్ర చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ జగడాలమాడి, తెంగిళ్ల బంధ సీమ రాయి గ్రామంలో 60 వరకు ఆదివాసి గిరిజనుల కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు రోడ్లు సరిగా లేక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. మొక్కుబడిగా రోడ్డు పనులు ప్రారంచి ఆపేసారు. నాలుగేళ్లుగా పనులు నిలిచిపోయినా పట్టించుకునే నాధుడు లేడు. రోగమొచ్చినా, ప్రాణాలమీదకొచ్చినా ఆసుపత్రికి వెళ్ళాలాంటే డోలీ కట్టాలైందే. ప్రధానంగా రోడ్లు లేక అవస్థలు పడుతున్నది గిరిజన గర్భిణీ మహిళలే. కొన్ని సందర్భాల్లో ఏజెన్సీలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. సరైన రోడ్లు లేక ఈ గ్రామాల్లోనూ గిరిజన గర్భిణీ మహిళల కష్టాలు, ప్రసవ వేదన వర్ణనాతీతం. అయితే.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసి మహిళలు మరోసారి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గిరిజన మహిళలంతా కలిసి డోలీ మోస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమకు రహదారి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..