AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupert Murdoch: లేటు వయసులో ఘాటు ప్రేమ.!  93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన మీడియా మొఘల్‌.

Rupert Murdoch: లేటు వయసులో ఘాటు ప్రేమ.! 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన మీడియా మొఘల్‌.

Anil kumar poka
|

Updated on: Mar 12, 2024 | 5:40 PM

Share

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వృద్ధ జంట ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌ గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వృద్ధ జంట ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. గతంలో మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో ఆమెకు వివాహమైంది. కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ కుమార్తె దాషా కూడా ఉంది. ఆమె రష్యన్‌ ఓలిగార్క్‌ను పెళ్లి చేసుకుని విడిపోయింది.

మర్దోక్ ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని వారితో తెగదెంపులు చేసుకున్నారు. గతేడాది 65 ఏళ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ తో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నారు. మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో వీరి ఎంగేజ్మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. తనకు చాలా సంతోషంగా ఉందనీ తను మళ్లీ ప్రేమలో పడ్డాననీ ఇదే తన చివరి వివాహం అవుతుందని తనక తెలుసునని నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్దోక్ అన్నారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా కాకముందే ఆయన లెస్లీతో నిశ్చితార్థం చేసుకొని అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నిశ్చితార్థం అయిన వారాల వ్యవధిలోనే వీరి బంధం తెగిపోయింది.

మర్దోక్ మొదటిసారి ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్‌ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండో భార్య అన్నా మరియా మన్‌ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow Us