విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు.. నిదర్శనం ఇదే

|

Jul 14, 2023 | 2:07 PM

కర్నాటక ఉడిపి జిల్లా కర్కాలా ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అయితే బెల్మన్నులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు పడటంతో బైకర్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు.