Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఇస్మార్ట్ దోపిడీ.. రవికల పేరుతో వ్యాపారుల మోసం.
ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే.. మరికొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తారు. అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే.. మరికొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తారు. అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులు అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు. 10 రూపాయలు చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్‌ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్‌లో ఆ రవికను ఇచ్చారు. అయితే దేవస్థాన కౌంటర్‌లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని సూచించారు. దీంతో షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమకు విక్రయించినది రవిక ముక్క కాదని, కనీసం ఖర్చీపు కూడా కాదని తెలుసుకున్నారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం ఎంత వరకు సబబని కౌంటర్‌లో సిబ్బందిని నిలదీశారు. దీనిపై మీరు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. ప్రతి నిత్యం ఇలా వందలాది మంది భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..