కోతులు అచ్చం మనుషుల మాదిరిగానే ప్రవర్తిసాయన్న సంగతి తెలిసిందే. ఇక చాలా సార్లు అవి చేసే అల్లరులు చూస్తే నవ్వులు తెప్పిస్తాయి. ఇక మరికొన్ని సార్లు వాటి వలన పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఇటీవల అడువులు తగ్గపోవడంతో.. కోతులు ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా.. ఇళ్ళలోకి దూరి నానా హంగామా చేస్తుంటాయి. అడువులు తగ్గిపోవడంతో.. వానారాలకు ఆహారం దొరకడం కష్టంగా మారిపోయింది. ఇక ఈ వేసవిలో జంతువుల పరిస్తితి మరీ దారుణమనే చెప్పుకోవాలి. తాజాగా దాహంతో అల్లడుతున్న ఓ వానరానికి అటుగా వెళ్ళున్న వ్యక్తి తన దగ్గర ఉన్న బాటిల్ తో నీళ్ళు పట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో.. కొండ ప్రాంతంగా ఉన్న ఓ ఊర్లో.. ఎత్తుగా ఉన్న రహదారి పక్కన ఓ టూరిస్టు తన దగ్గర ఉన్న బాటిల్లోని నీళ్లను ఓ కోతికి పట్టిస్తున్నాడు. ఇక అతను నీళ్ళు పడుతున్నంత సేపు ఆ వానరం బుద్దిగా కూర్చుంది. ఇక ఆ వానరం తర్వాత మరో కోతి అక్కడకు రాగానే దానికి కూడా నీళ్ళు పట్టించాడు. ఇక ఎండ ఎక్కువగా ఉండడంతో ఆ కోతి అతనికి దగ్గరగా జరిగి కూర్చుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా దయతో ఉండండి .. అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
వీడియో..
In a world where you can be anything, be kind ? pic.twitter.com/47preqtT9c
— Susanta Nanda IFS (@susantananda3) April 17, 2021
Also Read: Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. న్యూ ప్రాజెక్ట్ను ప్రారంభించిన విశ్వక్ సేన్..
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…