Viral Video: రూ.17,500 పెట్టి సెలూన్‌లో ఫేషియల్ చేయించిన మహిళ.. ఆ తర్వాత..?
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఉంది అన్నది సామెత. పాపం ముంబైలోని ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ముఖంపై గుంతలు పూడ్చేందుకు బ్యూటీ సెలూన్‌కు వెళ్తే.. అసలుకే మోసం వచ్చింది. ఒక్కసారి మా బ్యూటీ సెలూన్‌కి రండి..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఉంది అన్నది సామెత. పాపం ముంబైలోని ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ముఖంపై గుంతలు పూడ్చేందుకు బ్యూటీ సెలూన్‌కు వెళ్తే.. అసలుకే మోసం వచ్చింది. ఒక్కసారి మా బ్యూటీ సెలూన్‌కి రండి.. మీ ముఖం నిగనిగలాడిపోతుంది..? కళ్ల కింద కింద నల్లటి ఛారలుతో ఇబ్బంది పడుతున్నారా…? వాటిని మాయం చేసే బాధ్యత మాది.. ఇలానే చెప్పి వేలకు వేలు దండుకుంటున్నారు సెలూన్స్ వాళ్లు. రిజల్ట్ ఉంటుందా అంటే.. అది కూడా నమ్మే పని లేదు. కొన్ని చోట్ల ఫేస్ గ్లో రావడం పక్కన బెడితే అసలుకే మోసం వస్తుంది. తాజాగా ముంబైలో అదే జరిగింది. ఫేషియల్ మసాజ్ ట్రీట్‌మెంట్ చేయించడం వల్ల.. మహిళకు ముఖంపై కాలిన మాదిరిగా గాయలయ్యాయి. చర్మం కూడా పలు చోట్ల పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోయింది. జూన్ 17న అంధేరిలోని కామధేను షాపింగ్ సెంటర్‌లోని గ్లో లక్స్ సెలూన్‌కు సదరు మహిళ వెళ్లింది. అక్కడ 17,500 రూపాయల విలువైన హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ చేయించుకుంది. ఆ తర్వాత ఆమె ముఖం గతంతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. హైడ్రాఫేషియల్ అనేది వైద్య-స్థాయి రీసర్ఫేసింగ్ చికిత్స. ఈ ప్రాసెస్ ద్వారా ముఖంపై రంధ్రాలను క్లియర్ చేస్తారు. ఈ ప్రొసీజర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. లైసెన్స్ పొందిన వైద్య వృత్తిపరమైన సౌకర్యాలు ఉన్న చోట, సర్టిఫైడ్ హైడ్రాఫేషియల్ బ్యూటీషియన్ అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత, మహిళకు ముఖంపై చర్మం మండుతున్నట్లు అనిపించడంతో… డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించింది. హైడ్రాఫేషియల్ ట్రీట్‌మెంట్ వల్ల ఆమె ముఖంపై పలు చోట్ల కాలిన గాయాలు అయ్యాయని.. చర్మం శాశ్వతంగా దెబ్బతిన్నదని డెర్మటాలజిస్ట్ వెల్లడించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!