ఎంతో సంతోషంగా కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు.. ఇంతలోనే వీడియో
ప్రస్తుత కాలంలో మరు నిమిషం ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత మానవాళి మనుగడ పూర్తిగా మారిపోయింది. కారణం ఏదైనా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటివరకు కళ్ళముందు ఎంతో సంతోషంగా యాక్టివ్ గా ఉన్నవారు చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో మనం చూశాం. తాజాగా ఓ పోలీస్ అధికారి తన కుమార్తె వివాహం కోసం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పెళ్లి బాజాలు మోగక ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండిపోయింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన సాంబయ్య తిరుపతి ఈస్ట్ పీఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మాటలు రాకపోవడమే కాకుండా వినికిడి సమస్య కూడా ఉంది. దీంతో ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్న సాంబయ్య దంపతులు శ్రీకాళహస్తిలోని రాజీవనగర్ కు చెందిన సమీప బంధువుల కుమారుడితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి పెళ్లి పనులు చూసుకుంటున్న సాంబయ్య శ్రీకాళహస్తి సమీపంలోని అంజూరు కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి నుంచి పెండ్లికి కావలసిన వస్తువులు సామాన్లు కళ్యాణ మండపానికి చేర్చుతున్నారు సాంబయ్య.
మరిన్ని వీడియోల కోసం :
వావ్.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో
టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్ వీడియో
ఏనుగు ‘షాపింగ్’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో
ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్ వీడియో
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరి చరిత్ర సృష్టించిన టీచర్
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..

