Tiger in College: కాలేజీ క్యాంపస్‌లో పులి సంచారం.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు..

|

May 22, 2023 | 2:19 PM

మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్‌ కళాశాలలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇండోర్‌ జిల్లా మౌలో ఉన్న మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజ్ క్యాంపస్‌లోకి పులి ప్రవేశించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన క్విక్ రెస్పాన్స్ టీమ్

మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్‌ కళాశాలలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇండోర్‌ జిల్లా మౌలో ఉన్న మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజ్ క్యాంపస్‌లోకి పులి ప్రవేశించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన క్విక్ రెస్పాన్స్ టీమ్, అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పులి ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలతో జల్లెడపడుతున్నారు. ఈమేరకు అధికారులు సోమవారం వెల్లడించారు.కాలేజ్‌ క్యాంపస్‌లోని గేట్ నెంబర్ 3 వద్ద గత రెండు రోజులుగా రాత్రి వేళ పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కనిపించాయి. వాటిని పరిశీలించిన అధికారులు డ్రోన్‌ కెమెరాలతో పులికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇంకా పులి జాడ తెలియరాలేదని ఆర్మీ వార్ కాలేజ్ అధికారి ఒకరు తెలిపారు. క్యాంపస్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలు పొదలతో నిండి ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో కోరల్‌, మాండులో పులులు కనిపించాయని.. తాజాగా ఇక్కడ పులి కనిపించడం ఇదే తొలిసారని తెలిపారు. మరోవైపు, అటవీశాఖ అధికారులు, కళాశాల క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ తమ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 22, 2023 09:24 AM