Hair Looted:  బైక్​ను ఛేజ్​ చేసి మరీ వెంట్రుకలు చోరీ.. వెరైటీ దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో.

Hair Looted: బైక్​ను ఛేజ్​ చేసి మరీ వెంట్రుకలు చోరీ.. వెరైటీ దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: May 22, 2023 | 9:04 AM

గుజరాత్​లో దొంగలు రెండు బస్తాల వెంట్రుకలను చోరీ చేశారు. ఈ వెంట్రుకల బరువు 40 కిలోలు ఉంటుందని.. వాటి ధర దాదాపు 2 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. వెంట్రుకలు చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

గుజరాత్​లో దొంగలు రెండు బస్తాల వెంట్రుకలను చోరీ చేశారు. ఈ వెంట్రుకల బరువు 40 కిలోలు ఉంటుందని.. వాటి ధర దాదాపు 2 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. వెంట్రుకలు చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే వారి నుంచి రెండు బస్తాల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాజ్‌కోట్​.. పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్ అనే వ్యాపారి రెండు బస్తాల వెంట్రుకలతో బైక్​పై మోర్బీకి వెళ్తున్నాడు. ఆ రెండు బస్తాల్లో దాదాపు 40 కిలోల బరువున్న వెంట్రుకలు ఉన్నాయి. అయితే ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి పుష్పేంద్ర సింగ్ వద్ద ఉన్న వెంట్రుకల బస్తాలను దోచుకెళ్లారు. వారికి మరో ఇద్దరు సహకరించారు. వెంటనే పుష్పేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ చోరీపై కేసు నమోదు పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. రాజ్‌కోట్ సమీపంలోని పిప్లియా గ్రామంలో వెంట్రుకల బస్తాలను చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వెంట్రుకల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పలు అనారోగ్య సమస్యలు, కాలుష్యం వల్ల కొందరు మహిళల జట్టు ఊడిపోతుంది. ఆ వెంట్రుకలను గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లి వీధి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. మహిళలు జుట్టు ఇస్తే వారికి స్టీలు పాత్రలు లేదా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. వాటిని కంపెనీలు కొనుగోలు చేసి విగ్గులు తయారు చేస్తాయి. ఆ విగ్గులను క్యాన్సర్ రోగులు, బట్టతల ఉన్నవారికి అమ్ముతారు. వెంట్రుకలకు డిమాండ్ అధికంగా ఉన్నందున.. దొంగలు సైతం వాటిపై దృష్టిసారించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.